‘ఇందిరమ్మ’పై మరోసారి సీఐడీ విచారణ | CID officials enquiry on indiramma house constructions | Sakshi
Sakshi News home page

‘ఇందిరమ్మ’పై మరోసారి సీఐడీ విచారణ

Sep 24 2014 4:29 AM | Updated on Aug 11 2018 8:21 PM

మండలంలోని పెద్దనాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు.

నర్సింహులపేట : మండలంలోని పెద్దనాగారం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు. గతం లో విచారణ సమయంలో ఇళ్లకు తాళాలు వేసిన వారు, బతుకుదెరువు కోసం వలస వెళ్లినవారి ఇళ్ల ను ఈ సందర్భంగా పరిశీలించారు. ఇలా 60 ఇళ్లను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీఐడీ అధికారులు 7 బృందాలుగా విడిపోయి ఇళ్లను పరిశీలించారు. ఇళ్లు మంజూరైన  విషయం తమకు చెప్పకుండానే దళారులు బిల్లులు డ్రా చేశారని డీఎస్పీకి విన్నవించారు. ఇంటి పొజిషన్, రేషన్‌కార్డు, బ్యాంక్ అకౌంట్ పరిశీలన, డబ్బులు, బస్తాలు  ఎన్ని అందాయని అడిగి తెలుసుకున్నారు.
 
బాధ్యులపై చర్యలు తప్పవు..
ఇందిరమ్మ అక్రమాల్లో బాధ్యులపై చర్యలు తప్పవని సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ అన్నారు. అక్రమాలపై విచారణ కొనసాగుతూనే ఉంటుందన్నారు. ఆయన వెంట సీఐలు విజయ్‌కుమార్, కరుణసాగర్‌రెడ్డి, ఎస్సైలు వెంకటేశ్వరావు, రహమాన్, మధుసూదన్‌రెడ్డి, సీఐడీ సిబ్బంది, హౌసింగ్ డీఈ రవీందర్, ఏఈ రామచంద్రు, వర్క్‌ఇన్‌స్పెక్టర్లు వెంకన్న, దేవేందర్, రవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement