పిల్లలు తక్కువున్న అంగన్‌వాడీల మూసివేత!

Childrens Admission Effect on Anganwadi Schools - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తక్కువ పిల్లలున్న అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళం పాడాలని సర్కారు భావిస్తోంది. పిల్లల నమోదులో వెనుకబాటు, లబ్ధిదారుల సంఖ్య తక్కువగా ఉండటం లాంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించిన ప్రభుత్వం.. సేవలను విస్తృతం చేసే క్రమంలో ఒకేచోట రెండు, మూడు అంగన్‌వాడీ కేంద్రాలుంటే వాటి సంఖ్యను సైతం కుదించాలని యోచిస్తోంది. ఈ మేరకు సమగ్ర కార్యాచరణ రూపొందిస్తోంది. హేతుబద్ధీకరణకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలనే దానిపై రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కసరత్తు చేస్తోంది.

ప్రస్తుతమున్న అంగన్‌వాడీ కేంద్రాల్లో తక్కువ మంది లబ్ధిదారులు, స్వల్ప నమోదు ఉన్న కేంద్రాల జాబితాను రూపొందిస్తోంది. వీటితో పాటు నమోదైన వారి హాజరు శాతాన్ని కూడా పరిశీలిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 వేలకు పైగా గల కేంద్రాల్లో తక్కువ నమోదు ఉన్నట్లు అధికారుల గణాంకాలు చెబుతు న్నాయి. ఈ నేపథ్యంలో వీటి బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలను ఆ శాఖ పరి శీలిస్తోంది. కొన్నిచోట్ల దగ్గరగా ఉన్న కేం ద్రాలను విలీనం చేసే అంశాన్నీ పరిశీలి స్తోంది. నమోదు సంఖ్యకు తగ్గట్లు అంగన్‌వాడీ టీచర్లు, వర్కర్లను నియమిస్తారు. దీనిపై నెలలో నివేదికలు రూపొందించాల ని జిల్లా సంక్షేమాధికారులకు రాష్ట్ర కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top