చిన్నారులపై చిన్న చూపేలా?

Child Rights Commission on Child deaths - Sakshi

మరణాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: బాలల హక్కుల సంఘం

సాక్షి, హైదరాబాద్‌: తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, చెత్తకుప్పల్లో, ముళ్లపొదల్లో దొరికిన పిల్లలు, లైంగిక దాడులకు గురైన చిన్నారులకు కుటుంబ వాతావరణం కల్పించి వారి బాగోగులు చూడాల్సిన శిశు విహర్‌ కేంద్రాలు ఆ దిశగా పనిచేయడం లేదని బాలల హక్కుల సంఘం మండిపడింది.

ఇటీవల హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ శిశు విహార్‌ కేంద్రంలో 4 రోజుల వయసున్న నిత్య తలకు గాయమై, 9 నెలల వయసున్న సత్యశ్రీ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో మృత్యువాత పడ్డారు. ఈ  ఘటనల్లో సిబ్బంది నిర్లక్ష్యం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ శిశు విహార్‌ కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యంతోనే చిన్నారులు మృతి చెందారని, వారి మరణానికి కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం బాలల హక్కుల సంఘం హెచ్‌ఆర్సీలో పిటిషన్‌  వేసింది. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top