చెత్తకుప్పలో పసికందు మృతదేహం | child dead body found in roadside dustbin in warangal district | Sakshi
Sakshi News home page

చెత్తకుప్పలో పసికందు మృతదేహం

Dec 31 2015 11:06 PM | Updated on Sep 3 2017 2:53 PM

వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.

వరంగల్: వరంగల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. అప్పుడే పుట్టిన ఆడ శిశువును చంపి, చెత్తకుప్పలో పడేసిన ఘటన హన్మకొండలోని రామకృష్ణ కాలనీలో గురువారం జరిగింది.

కాలనీకి చెందిన కొందరు చెత్తను పడేసేందుకు హాస్టల్ పక్కన ఉన్న చెత్తకుప్ప వద్దకు రాగా, అక్కడ ప్లాస్టిక్ కవర్‌లో చుట్టిన శిశువు మృతదేహం కనిపించింది. అప్పటికే పందులు, కుక్కలు మృతదేహం తల భాగాన్ని వేరుచేసి ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆడశిశువు పుట్టిందనే చంపేసి చెత్తలో పడేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement