చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Chilakkur Balaji Brahmotsavas begin - Sakshi

మొయినాబాద్‌(చేవెళ్ల): కలియుగ దైవం చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు సోమవారం రాత్రి ప్రారంభమయ్యాయి. వారం రోజులపా టు కొనసాగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకు లు ప్రత్యేక పూజలు నిర్వహించి అంకురార్పణ చేశా రు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతి ష్టించి అర్చకులు పరావస్తు రంగాచార్యులు ఆ« ద్వర్యంలో బ్రహ్మోత్సవాల పూజా కార్యక్ర మాలు ఘనంగా నిర్వహించారు. మొదట సె ల్వర్‌ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్ఛారణ తో దేవాలయాన్ని శుద్ధి చేశారు.
 

అనంతరం పు ట్ట బంగానం (పుట్ట మన్ను) తీసుకొచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి.. అందులో నవధాన్యా లు, పాలికలు కలిపి హోమాలను వెలిగించారు. తరువాత విష్వక్సేనుడి ఆరాధన, పుణ్యహవచన కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారి ఉ త్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించిన అనంతరం యజ్ఞం చేపట్టారు. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమైన కార్యక్రమాలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. కార్యక్రమంలో ఆలయ మేనేజింగ్‌ కమిటీ చైర్మన్‌న్‌ సౌందరరాజన్, అర్చకులు రంగరాజన్, వరదరాజన్, బాలాజీ, మురళీ, కన్నయ్య, నర్సింహన్, సురేష్, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. 

నేడు గరుడ ప్రసాదం వితరణ... 
చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజు మంగళవారం ధ్వజారోహణం, శేషవాహనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతునికి సమర్పించే  నైవేద్యాన్ని సంతానం లేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేస్తారు. గరుడ ప్రసాదం కోసం అధిక సంఖ్యలో మహిళలు వచ్చే అవకాశం ఉండటంతో ఆలయం ముందు భాగంలో టెంట్లు వేసి తగిన ఏర్పాట్లు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top