దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మర్రిగూడ మండలం శివన్నగూడెంలో రూ.6వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న
చింతపల్లి : దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు తాగు, సాగు నీరు అందించేందుకు మర్రిగూడ మండలం శివన్నగూడెంలో రూ.6వేల కోట్ల వ్యయంతో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ పథకం పనులు ప్రారంభించేందుకు జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనను విజయవంతం చేయాలని జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ కోరారు. మంగళవారం మండల కేంద్రంలోని ఐబీ కార్యాలయంలో నిర్వహించిన టీఆర్‌ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కరువు కాటకాలు, ఫ్లోరైడ్ సమస్యతో తల్లడిల్లుతున్న ఈ రెండు నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం ఈ పనులను చేపట్టినట్టు పేర్కొన్నారు.
తెలంగాణ అభివృద్ధి సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రతిఒక్కరు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి పర్యటనకు దేవరకొండ నియోజకవర్గం నుంచి 10వేల మంది కార్యకర్తలు తరలి రావాలని కోరారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గోపిడి కిష్టారెడ్డి, ఎంపీపీ వాంకుడావత్ రవి, జెడ్పీటీసీ జెటావత్ హరినాయక్, నాయకులు మాస భాస్కర్, ముచ్చర్ల యాదగిరి, ఎల్లెంకి అశోక్, అంగిరేకుల నాగభూషణం, ఎరుకల వెంకటయ్యగౌడ్, ఎల్లెంకి చంద్రశేఖర్, అంగిరేకుల గోవర్ధన్, అక్రం, ఉజ్జిని రఘురాం, ఎండీ.ఖాలెద్, కాసారపు శ్రీను తదితరులు పాల్గొన్నారు.