సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ | Cheques Distribution MLA Ravindra Kumar In Nalgonda | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

May 30 2018 9:13 AM | Updated on Aug 29 2018 4:18 PM

Cheques Distribution MLA Ravindra Kumar In Nalgonda - Sakshi

 సీఎం సహాయనిధి చెక్కును అందజేస్తున్న ఎమ్మెల్యే

దేవరకొండ : సీఎం సహాయనిధి కింద మంజూ రైన చెక్కులను మంగళవారం ఎమ్మెల్యే స్థానికంగా బాధితులకు అందించారు. చందంపేట మండలం గాగిళ్లాపురానికి చెందిన లక్ష్మికి రూ. 10వేలు, కంబాలపల్లికి చెందిన సతీష్‌కు రూ. 22,500 చెక్కులను బాధితులకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహాయనిధి కింద అందించే సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆపద సమయాల్లో వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిది ఆపద్భందులా ఆదుకుంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మార్కెట్‌కమిటీ వైస్‌ చైర్మన్‌ ముచ్చర్ల ఏడుకొండలు, జాన్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, శిరందాసు కృష్ణయ్య, బుయ్య మహేశ్, వడ్త్య దేవేందర్, చీదెళ్ల గోపి, బొడ్డుపల్లి కృష్ణ, వడ్త్య బాలు, బషీర్, సురేష్, నర్సింహ  తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement