తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు 23న జిల్లాకు రానున్నారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు 23న జిల్లాకు రానున్నారు. జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ జిల్లాస్థాయి కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా పర్యటన సందర్భంగా టీడీపీకి చెందిన జిల్లా నేతలతో చంద్రబాబు పాల్గొనే కార్యక్రమం నిర్వహించాల్సిన తీరుపై ఆ యన చర్చించినట్లు సమాచారం. ఏర్పాట్లు భారీస్థాయిలో ఉండేట్లు చూడాల్సిందిగా పార్టీ జిల్లా నేతలకు సూచించినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన, సాధారణ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇటీవల వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో పర్యటించిన విషయం తెలిసిందే.