అండగా ఉంటా.. ఆదరించండి.. | Challa Dharma Reddy Elections Camping In Warangal | Sakshi
Sakshi News home page

అండగా ఉంటా.. ఆదరించండి..

Nov 3 2018 12:33 PM | Updated on Nov 11 2018 1:03 PM

Challa Dharma Reddy Elections Camping In Warangal - Sakshi

ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి

నియోజకవర్గంలోని ప్రతి గ్రా మాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండగా నిలుస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చల్లా ధర్మారెడ్డి ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని కమలాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. 
 
పరకాల రూరల్‌: నియోజకవర్గంలోని ప్రతి గ్రా మాన్ని అభివృద్ధి చేశానని, మరోసారి తనను ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే అండగా నిలుస్తానని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి, తాజా మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చల్లా ధర్మారెడ్డి ఓటర్లను కోరారు. నియోజకవర్గంలోని కమలాపురం మండలం వెంకటేశ్వర్లపల్లి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్‌ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాజకీయాలకు అతీతంగా అమలు చేస్తామని, ఆయా పథకాలను దేశంతోపాటు ప్రపంచదేశాలు మెచ్చుకున్నాయన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో సుమారు కోటి రూపాయల మేర అభివృద్ధి  జరిగిందన్నా రు.

గ్రామానికి ఇటీవలే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మంజూ రైందని, ఉగాది వరకు ఆ ప్రాజెక్టు నిర్మా ణం పూర్తి చేసి గ్రామంలోని ప్రతి ఎకరాకు రెండో పంటకు నీరందిచేలా చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. పరకాల నుంచి వెంకటేశ్వర్లపల్లి మీదుగా జమ్మికుంట వరకు బస్సు సౌకర్యం కల్పించడంతోపాటు మల్లక్కపేట నుంచి గ్రామానికి డబుల్‌ రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో నియోజకవర్గ రూపురేఖలు మార్చి ఇక్కడి నుంచి కొందరు పారిపోయారని కొండా దంపతులను ఉద్దేశించి మాట్లాడారు.

నాగుర్ల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంటికి పెద్దన్నలా కేసీఆర్‌ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రతి కుటుం»బం లబ్ధిపొందేలా పథకాలను రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. కోటి ఆశలతో సాధించుకున్న తెలంగా ణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దే సామర్థ్యం ఒక్క కేసీఆర్‌కు ఎందన్నారు. ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మరోసారి టీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి, ఎంపీపీ నేతాని సులోచన, టీఆర్‌ఎస్‌ నాయకులు పాడి ప్రతాప్‌ రెడ్డి, బీముడి నాగిరెడ్డి, నందికొండ జైపాల్‌ రెడ్డి , గురిజపల్లి ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement