రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు.
భువనగిరి (నల్లగొండ) : రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు రెండున్నర తులాల పుస్తెల తాడును లాక్కెళ్లారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరి పట్టణంలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని వీరపల్లె గ్రామానికి చెందిన గుత్తికొండ అనసూయ ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవడానికి భువనగిరికి వచ్చి తిరిగి వెళ్తున్న సమయంలో.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తుల ఆమె వద్దకు వచ్చి ఆమెతో మాటలు కలిపి అకస్మాత్తుగా ఆమె మెడలో నుంచి రెండున్నర తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. దీంతో ఆమె పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.