రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు
రాష్ట్రంలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు..
కరీంనగర్: చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. రాష్ట్రంలోని రెండు వేర్వేరు చోట్ల స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లిలో ఆరుబయట నిద్రిస్తున్న మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెల తాడు లాక్కెళ్లారు. గ్రామానికి చెందిన గుజ్జ అరుణ వేసవి కాలం కావడంతో ఆరుబయట మంచంపై నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని దుండగులు ఆమె మెడలోని 2 తులాల బంగారు తాళిబొట్టను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
ఇదిలా ఉండగా.. మహబూబాబాద్ మండలం నడివాడకు చెందిన ఓ మహిళ మెడలో నుంచి బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు 4 తులాల బంగారు ఆభరణాలు లాక్కెళ్లారు. దీంతో బాధితురాలు లబోదిబోమంటు పోలీసులకు ఫిర్యాదు చేసింది.