ఆ చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు ఇలా.. | chain snachers captured by police | Sakshi
Sakshi News home page

ఆ చైన్ స్నాచర్లు పట్టుబడ్డారు ఇలా..

Aug 4 2015 6:43 PM | Updated on Mar 28 2018 11:08 AM

మహిళ మెడలో గొలుసు తెంపుకుని పోయేందుకు యత్నించిన వ్యక్తులు దొరికిపోయారు.

నవాబుపేట: మహిళ మెడలో గొలుసు తెంపుకుని పోయేందుకు యత్నించిన వ్యక్తులు దొరికిపోయారు. అయితే, పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతూ మళ్లీ పట్టుబడ్డారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలం మైతాప్‌ఖాన్‌గూడ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం స్టేషన్‌ నాగులపల్లికి చెందిన రవి, అశోక్ బైక్‌పై వెళ్తూ మైతాప్‌ఖాన్‌గూడ సమీపంలో తెలుగు లలిత అనే మహిళ మెడలో గొలుసు లాక్కొని పోయేందుకు యత్నించగా ఆమె భర్త అశోక్ అప్రమత్తమై స్థానికుల సాయంతో వారిని పోలీసులకు అప్పగించాడు.

స్థానికుల చేతిలో దెబ్బలు తిన్న నిందితులను పోలీసులు చికిత్స కోసం మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వారి కళ్లుగప్పి పారిపోయాడు. మంగళవారం స్టేషన్‌లింగంపల్లిలో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించినట్లు ఎస్ఐ శ్రీనివాస్ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement