రాష్ డ్రైవింగ్.. ఫలితం కారు సీజ్ | Car seized by police to rash driving | Sakshi
Sakshi News home page

రాష్ డ్రైవింగ్.. ఫలితం కారు సీజ్

Mar 11 2015 9:38 PM | Updated on Sep 2 2017 10:40 PM

రాష్ డ్రైవింగ్.. ఫలితం కారు సీజ్

రాష్ డ్రైవింగ్.. ఫలితం కారు సీజ్

నగరంలో అతి వేగంగా నడుపుతున్న కారును పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు.

హైదరాబాద్ సిటీ: నగరంలో అతి వేగంగా నడుపుతున్న కారును పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. మలక్ పేట్‌కు నిజాముద్దీన్ ఖురేషి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజాగుట్ట వైపు కారును వేగంగా నడుపుకుంటూ వెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్‌తో తోటి ప్రయాణికులు ఆందోళన చెందారు.

అక్కడే ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు అందించాడు. కానిస్టేబుల్ కారును వెంబడించి నాగార్జున సర్కిల్ వద్ద పట్టుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిజాముద్దీన్ నుంచి లెసైన్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న విదేశీ స్పోర్ట్స్ కారు విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుంది.

Advertisement
 
Advertisement
Advertisement