breaking news
Panja gutta police
-
139 అత్యాచారం: డాలర్ బాయ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్ : తనపై 139 మంది అత్యాచారం చేశారని ఆరోపిస్తూ పోలీసులను ఆశ్రయించిన యువతి కేసులో విచారణను వేగవంతం చేశారు. ప్రత్యేక దర్యాప్తు కోసం ఈ కేసును సీసీఎస్‌కు బదిలీ చేసిన పంజాగుట్ట పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న కొంత మందిని ఇదివరకే విచారించారు. అనంతరం ప్రధాన నిందిడుడైన రాజశ్రీకర్ రెడ్డి అలియాస్ డాలర్ బాయ్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న అతన్ని శుక్రవారం సీసీఎస్ పోలీసులు గోవాలో అదుపులోకి తీసుకుని.. నగరంలోని నాంపల్లి కోర్టుకు తరలించారు. డాలర్ బాయ్ ఒక్కడే తనపై లైంగిక దాడికి పాల్పడినట్లు బాధితురాలు తాజా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో నిందితుడుపై 376, 184, 185,509, 67 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. యువతి వాంగ్మూలం ఆధారంగా కేసును దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగానే మరికొన్ని వివరాల కోసం అతన్ని రిమాండ్‌లోకి తరలించే అవకాశం. కాగా యువతి ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. -
143 మంది అత్యాచారం కేసు: స్పందించిన ప్రదీప్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనంగా మారిన యువతిపై 143 మంది అత్యాచారం కేసులో ప్రముఖ యాంకర్ మాచిరాజు ప్రదీప్ పేరు కూడా ఉన్న విషయం తెలిసిందే. యువతి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు అతనిపై కేసు సైతం నమోదు చేసినట్లు తెలుస్తోంది. దీనిపై పలువర్గాల నుంచి ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా యాంకర్ ప్రదీప్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తనపై వస్తున్న ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం సాయంత్రం సోషల్ మీడియా ద్వారా ఓ వీడియోను విడుదల చేశారు. కొందరు వ్యక్తులు కావాలనే తనను టార్గెట్‌గా చేసుకుని తనకు ఎలాంటి సంబంధంలేని వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనను తన కుటుంబాన్ని ఎంతో మానసిక కుంగుబాటుకు గురిచేస్తున్నారని అన్నారు. (42 పేజీల ఎఫ్ఐఆర్ రెడీ!) ‘సోషల్ మీడియాలో నా మీద వస్తున్న ఆరోపణలు ఎంతో బాధపెడుతున్నాయి. సున్నితమైన వివాదంలో నా పేరు పెట్టి ఉద్దేశపూర్వకంగానే అటాక్ చేస్తున్నారు. అవతలి వ్యక్తులు నా పేరు ఎందుకు పెట్టారో తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ చేస్తున్నారు. మీడియా వ్యూస్ కోసం నన్ను టార్గెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై ఫిర్యాదు చేస్తాను. మీ ఆరోపణల కారణంగా నా కుటుంబం మానసికంగా బలవుతుంది. మమ్మల్ని మానసికంగా మానభంగం చేస్తున్నారు. బాధితురాలికి న్యాయం జరగాలి కానీ నిజాలు తెలియకుండా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఒక్కో మెట్టు ఎదిగిన నన్ను కావాలని వివాదంలోకి లాగుతున్నారు. సోషల్ నెట్ వర్క్ లో నా పేరు వాడటం చాలామందికి అలవాటుగా మారింది. అనవసరమైన ఆరోపణలతో నా సన్నిహతులు, అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నిజానిజాలు ఖచ్చితంగా బయటకు రావాలి’ అని వీడియో ద్వారా వెల్లడించారు. తనపై 143 మంది లైంగిక దాడికి పాల్పడ్డారంటూ పంజాగుట్ట పోలీసు స్టేషన్లో ఇటీవల ఓ యువతి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీసీఎస్ పోలీసులు వేగవంతం చేశారు. ఎఫ్ఐఆర్, బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా నిందితులను విచారించేందుకు ప్లాన్ చేస్తున్నారు. 143 మంది నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. ఇప్పటికే 42 పేజీలతో ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. 143 మందిలో ప్రముఖ రాజకీయ నాయకుల పీఏలు, టీవీ నటులు, పోలీసులు, ఎస్ఎఫ్ఐ లీడర్లు ఉన్నట్టు బాధితురాలు తెలిపింది. దీంతో ఈ కేసు సంచలనంగా మారింది. -
రాష్ డ్రైవింగ్.. ఫలితం కారు సీజ్
హైదరాబాద్ సిటీ: నగరంలో అతి వేగంగా నడుపుతున్న కారును పంజాగుట్ట పోలీసులు సీజ్ చేశారు. మలక్ పేట్‌కు నిజాముద్దీన్ ఖురేషి ఖైరతాబాద్ చౌరస్తా నుంచి పంజాగుట్ట వైపు కారును వేగంగా నడుపుకుంటూ వెళ్లాడు. ర్యాష్ డ్రైవింగ్‌తో తోటి ప్రయాణికులు ఆందోళన చెందారు. అక్కడే ఉన్న కానిస్టేబుల్ వెంకటేష్ ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు అందించాడు. కానిస్టేబుల్ కారును వెంబడించి నాగార్జున సర్కిల్ వద్ద పట్టుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేసిన నిజాముద్దీన్ నుంచి లెసైన్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న విదేశీ స్పోర్ట్స్ కారు విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుంది.