గ‘మ్మత్తు’గా గంజాయి దందా

Cannabis Illegal Business Spread In Villages - Sakshi

యువతే టార్గెట్‌

పట్టణంలో ఇష్టారాజ్యంగా అమ్మకాలు

చోద్యం చూస్తున్న పోలీసులు

తల్లిదండ్రుల్లో కలవరం

డ్రగ్స్ : తూప్రాన్‌ పట్టణానికి బతుకుదెరువు కోసం ఓ కుటుంబం పది సంవత్సరాల క్రితం వచ్చింది. వీరికి ఏకైక కుమారుడు. మంచి ఉన్నత చదువులు చదివించాలన్న లక్ష్యంతో హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో చేర్పించారు. అయితే కుమారుడు స్థానికంగా ఉన్న తన స్నేహితులతో కలిసి సరదాగా తిరగడం ప్రారంభించాడు. ఈ క్రమంలో చేడు వ్యసనాలకు బానిసగా మారాడు. తల్లిదండ్రులు మందలించిన ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. 

తూప్రాన్‌లో యువకుల అడ్డాలు...
పట్టణంలోని గోల్డెన్‌పార్కు, నర్సాపూర్‌ చౌరస్తాలోని హోటల్, పట్టణ సమీపంలోని పెద్ద చెరువుకట్ట, పట్టణ సమీపంలో నూతనంగా వెలసిన వెం చర్లు, బ్యాచ్‌లర్స్‌ నివాసం ఉంటున్న అద్దెగదుల ను వాడుకుంటున్నారు. ఈ ప్రాంతాల్లో గంజాయి ని సిగరేట్లలో కలిపి తాగుతున్నారు. బాంకు, ఓసీ బీ అనే పేపరులో గంజాయిని నింపి సిగరేటుగా తయారు చేసుకొని తాగుతున్నట్లు సమాచారం.

పల్లెలపై దృష్టి సారించిన అక్రమార్కులు..
హైదరాబాద్‌లో పోలీసుల నిఘా పెరిగిపోవడంతో గంజాయీ మాఫియా పల్లే ప్రాంతాల్లోని యువతపై దృష్టి సారించినట్లు తెలస్తుతోంది. ఈ క్రమంలోనే జిల్లాలోని కొందరు యువకులతో పరిచయం పెంచుకుని అమ్మకాలు చేయిస్తోంది. వీరిలో ఎక్కువగా మధ్యతరగతి వారి పిల్లలే ఉన్నట్లు సమాచారం.
 
ప్రకటనలకే పరిమితమైన అవగాహన..
మత్తు పదర్థాల వాడకంపై యువతకు అవగాహన కల్పించాల్సిన అధికారులు అటువైపుగా ఎలాంటి కార్యచరణ చేపట్టకపోవడం, కళాశాలల్లో పెడదోవ పడుతున్న వారిపై దృష్టి సారించి విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసం ఎంతైన ఉంది. 

మత్తుబారిన పడిన వారిలో లక్షణాలు...

  • మత్తుకు అలవాటు పడిన వారు నరాల బలహీనత, మెదడు మొద్దుబారడం, శరీరంలోని ఇత ర వ్యవస్థలు నియంత్రణలో ఉండకపోవడం, శరీరం తేలికపడినట్లు అయి కొద్ది సమయం తర్వాత కొత్తశక్తి వచ్చినట్లు అవుతుంది.
  • మొదట నాడీవ్యవస్థ, మెదడు, కండరాలు వ్యవస్థలపై ప్రభావం చూపుతుంది. తర్వాత తమ ఆధీనం కోల్పోయి వెలుగును చూడలేరు. అధిక శబ్ధాలను వినలేరు. 
  • ఎక్కువగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఎవరితో సరిగా మాట్లాడరు. డ్రగ్స్, గంజాయి లభించకపోతే సైకోలాగా తయారువుతారు.
  • సమయానికి ఆహారం తీసుకోకపోవడంతో అల్సర్‌ బారినపడతారు. నాసికరంధ్రాలు వాసనను పసిగట్టే శక్తిని కోల్పోతాయి. సిగరేట్ల రూపంలో పీల్చేవారికి నాలుక రుచిని కోల్పోతుంది. ఊపిరితిత్తుల వ్యవస్థ గోడలు నాశనమై చివరకు మరణానికి దారితీస్తుంది. 
  • మత్తు పదార్థాలు తీసుకున్న వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారు. తమ చుట్టూ ఎం జరుగుతుందో కూడా గమనించరు. ఆ సమయంలో వారు ఏం చేస్తారో కూడా వారికి అర్థంకాదు.
  •  ఇంట్లోవారు గానీ.. మిత్రులుగానీ గమనిస్తే వీరిలో చాలా తేడాలు కనిపిస్తాయి. వీరికి వెంటనే వైద్యం సహాయం అందిస్తే త్వరగా బయటపడే అవకాశాలుంటాయి.

 గంజాయి మత్తులో..
స్నేహితులతోనో.. సరదాగానో వీటివైపు ఆకర్షితులైన యువకులు ఆ అలవాటును వ్యసనంగా మార్చుకుంటున్నారు. కొద్దిరోజుల తర్వాత మత్తు లేకుంటే బతకలేమనే స్థితికి దిగజారుతున్నారు. కేవలం యూత్‌ను టార్గెట్‌ చేస్తున్న కొందరు గంజాయి వంటి మత్తు పదార్థాలను ఇతర ప్రాంతాలనుంచి పట్టణానికి యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మెదక్‌ జిల్లా తూప్రాన్‌ డివిజన్‌ కేంద్రంలో పలువురు యువకులు జల్సాలు, షికార్లు, చెడు వ్యసనాలకు బానిసలై దారి తప్పుతున్నారు. తెలిసీతెలియని వయసులో నేరాలకు పాల్పడుతున్నారు. పలు కేసుల్లో చిక్కుకొని జీవితాలను బుగ్గిపాలు చేసుకుంటున్నారు. జిల్లాలో పట్టుబడిన పలు దొంగతనాల కేసుల్లో యువకులే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఆయా కేసుల్లో యువకులను పోలీసులు విచారించే సమయంలో సరదాకోసం, తల్లిదండ్రులు డబ్బు ఇవ్వకపోవడం, ప్రియురాలికి కానుకలు ఇవ్వడంకోసం అంటూ వెల్లడించడం పోలీసులకు సైతం ఆశ్చర్యానికి గురిచేస్తున్న విషయం. తూప్రాన్‌ పట్టణానికి మేడ్చెల్, కొంపల్లి, హైదరాబాద్, చేగుంట, కామారెడ్డి నుంచి కొందరు వ్యక్తులు గంజాయిని చిన్నచిన్న ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సిగరెట్లలో గంజాయి నింపుతూ ఎవరికీ అనుమానం రాకుండా ప్రత్యేక కోడ్‌లతో అమ్ముతున్నారు. 10 గ్రాముల నుంచి 100 గ్రాముల ప్యాకేట్‌ను రూ.100 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. 

చర్యలు తీసుకుంటాం..
తూప్రాన్‌లో గంజాయి వినియోగిస్తున్నట్లు తమ దృష్టికి రాలేదు. యువత పట్ల ఎప్పటికప్పుడూ సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా నిఘా పెంచాం. పిల్లల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి. చెడు వ్యసనాలకు గురికాకుండా వారిపై పర్యవేక్షణ ఉండాలి. మంచి స్నేహితులు ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే గంజాయి విక్రయించడం చట్టరీత్య నేరం. గంజాయి విక్రయిస్తున్న వారి సమాచారం అందిస్తే వారిపై చర్యలు తీసుకుంటాం. – లింగేశ్వర్‌రావు, సీఐ, తూప్రాన్‌

దశాదిశాలేని చదువే కారణం...
యవత విలువైన దుస్తులు, షూస్‌ ధరించాలని, ఖరీదైన కార్లలో, బైక్‌లపై తిరగాలని, విలాసవంతమైన జీవితం గడపాల ని కలలు కంటున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి కష్టపడడం కంటే... దొడ్డిదారిన వారికి కావాల్సిన వాటి కో సం అన్వేషిస్తున్నారు. ప్రస్తుతం విద్యా విధానంలో విద్యార్థి ప్రతిభకు మార్కులే కొలమాన ంగా మారాయి. జ్ఞానం నేర్పుతున్నారనేగానీ నైతిక విలువలు, నీతి, నిజాయితీ, మంచి – చెడు, పెద్దలంటే గౌరవం నేర్పించడంలేదు. – మోత్కు రాంచంద్రం, మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top