కూల్‌గా.. కామ్‌గా..!

Candidates Canvass Through Social Media - Sakshi

సోషల్‌ మీడియాలో అభ్యర్థుల ప్రచారం

వాట్సప్, ఫేస్‌బుక్కుల్లో మేనిఫెస్టోలు పోస్ట్‌ చేసి ఓటర్లను అభ్యర్థిస్తున్న వైనం 

ఎన్నికల ప్రచారం అంటే మైకుల హోరు.. డప్పువాయిద్యాలు.. బాణసంచా చప్పుళ్లు వినిపించేవి. కాలం మారింది. కొంత పుంతలు తొక్కుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. తాము చెప్పదలచుకున్న విషయాన్ని క్షణాల్లో ఓటర్లు, కార్యకర్తలకు చేరిపోయేలా ప్లాన్‌ చేసుకుంటున్నారు. అందుకు వాట్సప్, ఫేస్‌బుక్‌లను ఉపయోగించుకుంటున్నారు. తమ పార్టీ మేనిఫోస్టోతో పాటు.. ఎన్నికల్లో తమను గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కామ్‌గా.. కూల్‌గా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.  


మిర్యాలగూడ...
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి : నల్లమోతు భాస్కర్‌రావు
ఫేస్‌బుక్‌ ఖాతా : నల్లమోతు భాస్కర్‌రావు
ఫేస్‌ బుక్‌ ఫెండ్స్‌ : 35,678
పోస్టింగ్‌లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారంలో నిర్వహించిన ఫొటోలతో పాటు వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్టులు చేస్తున్నారు. అదే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు తిరిగి అధికారంలో వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలను కూడా ప్రచారంలో పెట్టారు. 
వ్యూవర్స్‌ : ఎక్కువగా పార్టీ కార్యకర్తలే ఉన్నారు. ఈ సారి కూడా ఎన్నికల్లో గెలుస్తాడని, మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందనే పోస్టులు పెడుతున్నారు.

 
కాంగ్రెస్‌ అభ్యర్థి : ఆర్‌.కృష్ణయ్య
ఫేస్‌బుక్‌ ఖాతా : ర్యాగా కృష్ణయ్య
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ : 38,521
పోస్టింగ్‌లు : ప్రతి రోజు ఎన్నికల ప్రచారం ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడు ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకంగా వచ్చిన వీడియో క్లిప్పింగ్‌లు, మహాకూటమి అధికారంలోకి వస్తే చేస్తామని చెబుతున్న ఎన్నికల మేనిఫెస్టోలకు సంబంధించిన ఫోటోలు అప్‌లోడ్‌ చేస్తున్నారు. 
వ్యూవర్స్‌ : బీసీలంతా ఏకమై గెలిపించాలని కోరుతూ ఉద్యమ నాయకుడు ఆర్‌ కృష్ణయ్యను గెలిపించాలని కోరుతూ పోస్టింగ్‌లు పెడుతున్నారు.  


నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి : కాంగ్రెస్‌ పార్టీ 
ఫేస్‌బుక్‌ పేరు : నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ సంఖ్య : 5,000 మంది 
నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తన పేరు మీద ఫేస్‌బుక్‌ ప్రారంభించారు. ఫేస్‌బుక్‌లో 5వేల మంది ఫ్రెండ్స్‌ ఉన్నారు. ప్రతిరోజు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాష్ట్ర, నియోజకవర్గానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను పోస్టింగ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ ద్వారా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలు, మేనిఫెస్టో అంశాలను వివరించడంతోపాటు లైవ్‌ ప్రోగ్రామ్‌లు కూడా నిర్వహిస్తూ నేరుగా ప్రసంగాలు కూడా చేస్తున్నారు. అంతేగాక ఉత్తమ్‌సేన, ఉత్తమ్‌ యువసేన పేరుతో మరో రెండు ఫేస్‌బుక్‌ ఖాతాలు కూడా ఆయన అనుచరులు ప్రారంభించి విస్తృత ప్రచారాలు చేస్తున్నారు.  


హూజూర్‌నగర్‌...
శానంపూడి సైదిరెడ్డి : టీఆర్‌ఎస్‌ పార్టీ 
ఫేస్‌బుక్‌ పేరు : శానంపూడి సైదిరెడ్డి, అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్‌ 
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ సంఖ్య : 5,000
టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సైదిరెడ్డి తన పేరుమీద ప్రారంభించిన ఫేస్‌బుక్‌లో తన ప్రచార  పోస్టింగ్‌లు పెడుతున్నారు. స్థానికత నినాదంతో ముందుకు వెళుతున్న ఆయన ఫేస్‌బుక్‌లోని తన ఫాలోవర్స్‌ను చైతన్యం చేసేందుకు ఇతర ప్రాంతాలకు చెందిన అభ్యర్థుల వల్ల నియోజకవర్గం ఏ విధంగా నష్టపోయిందనే అంశాలను వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలను కూడా పోస్టింగ్‌ చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్త అంశాలను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేగాక సైదిరెడ్డి తన తండ్రి పేరు మీద ప్రారంభించిన అంకిరెడ్డి ఫౌండేషన్, సై యూత్‌ పేర్లపై కూడా ఫేస్‌బుక్‌లు ప్రారంభించారు. ఈ రెండు సోషల్‌ మీడియా ఖాతాలను సుమారు 10 వేల మంది ఫాలో  అవుతున్నారు. అంకిరెడ్డి ఫౌండేషన్‌ సభ్యులతో పాటు సై యూత్‌ సభ్యులు కూడా సైది రెడ్డికి మద్దతుగా విస్తృతంగా పోస్టింగ్‌లు పెడుతూ ప్రచారం చేస్తున్నారు.  

భువనగిరి...
ఫేస్‌బుక్‌ పేరు : అనిల్‌కుమార్‌రెడ్డి కుంభం
ఫేస్‌బుక్‌
ఫ్రెండ్స్‌ సంఖ్య : 22,802
ఫేస్‌బుక్‌లో పెడుతున్న పోస్టింగ్‌లు: ప్రస్తుతం ఎన్నికల ప్రచార చిత్రాలు. ఎన్నికల ప్రచార లైవ్‌ కార్యక్రమాలు. ఎన్నికల ప్రచా రాలకు సంబంధించిన లైవ్‌ వీడియోలు. నాలుగేళ్ల కాలంలో భువనగిరి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి చేసిన పోరాటాలు, పాదయాత్రలు, సమావేశాలు. ధర్నాలు, రాస్తారోకోలు వంటి పోస్టింగ్‌లు పెడుతున్నారు. వీటితో సమాజ సేవా కార్యక్రమాలకు సంబంధించిన చిత్రాలు ఫేస్‌బుక్‌లో పోస్టింగ్‌ చేస్తున్నారు.  

జోరుగా ప్రచారం.. 
తిరుమలగిరి (తుంగతుర్తి) :  తుంగతుర్తి నియోజకవర్గంలో అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఫేస్‌బుక్, వాట్సప్‌లలో తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గాదారి కిశోర్‌కుమార్‌ తన పేరు మీదనే ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో ఖాతాలు తెరిచి ప్రతిరోజు ప్రచారానికి సంబంధించిన ఫొటోలు, కార్యక్రమాల వివరాలను పోస్ట్‌ చేస్తున్నారు.  దీంతో పాటు తుంగతుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ పార్టీ, జీకే యూత్, అన్ని మండలాల గ్రూపులతో వాట్సప్‌ ఖాతాలు తెరిచి ప్రతిరోజు కార్యక్రమాలు తెలియజేస్తున్నారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అద్దంకి దయాకర్‌ ఫేస్‌బుక్, వాట్సప్‌లలో 25 గ్రూపుల ద్వారా తన ప్రచార కార్యక్రమాన్ని, పర్యటన వివరాలను తెలియజేస్తున్నారు. బీజేపీ పార్టీ అభ్యర్థి కడియం రామచంద్రయ్య సామాజికమాద్యమాల్లో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

అభ్యర్థి పేరు : గాదరి కిశోర్‌కుమార్‌. 
ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల పేర్లు : 
గాదరి కిశోర్‌కుమార్‌
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ సంఖ్య : 4448
ట్విట్టర్‌ ఫాలోవర్ల సంఖ్య : 2560  


అభ్యర్థి పేరు : అద్దంకి దయాకర్‌
ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల పేరు : అద్దంకిదయాకర్‌ 
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ సంఖ్య : 5 వేలు 
ట్విట్టర్‌ఫాలోవర్ల సంఖ్య : 1670  

అభ్యర్థి పేరు :కడియం రామచంద్రయ్య 
ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఖాతాల పేరు : కడియం రామచంద్రయ్య 
ఫేస్‌బుక్‌ ఫ్రెండ్స్‌ సంఖ్య : 3859  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top