వావి వరసలు మరచి వదినపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తి.. ఆమె ప్రతిఘటించడంతో చివరకు గొంతు నులిమి హత్య చేశాడు.
కాటారం (కరీంనగర్) : కరీంనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. వావి వరసలు మరచి వదినపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తి.. ఆమె ప్రతిఘటించడంతో చివరకు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ సంఘటన కాటారం మండలం చింతకాని గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీరాల పోచం(44) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ క్రమంలో శనివారం రాత్రి బాగా మద్యం సేవించి పక్కనే ఉన్న వదిన చీరాల లచ్చక్క(45) ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. దాంతో ఆమె కేకలు వేసింది. ఆమె అరిస్తే తన బుద్ధి బయట పడిపోతుందని గొంతు నులిమి హత్య చేశాడు. ఆదివారం ఉదయం ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.