బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు 4 వారాల పాటు నిలిపివేసింది.
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అల్లుడు బ్రదర్ అనిల్‌కుమార్‌పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులో తదుపరి చర్యలన్నింటినీ హైకోర్టు 4 వారాల పాటు నిలిపివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఖమ్మం జిల్లా పోలీసులను న్యాయమూర్తి ఆదేశించారు. 2009 సాధారణ ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో స్థానిక పాస్టర్లతో సమావేశం నిర్వహించి కాంగ్రెస్‌కే ఓటు వేయాలంటూ కోరారని, ఇది ఎన్నికల నియమావళికి విరుద్ధమంటూ రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యా దు చేశారు.
దీంతో అనిల్‌కుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఖమ్మం, రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. దీనిని పరిశీలించిన కోర్టు, ఈ నెల 26న అనిల్‌కుమార్ హాజరవాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించా రు. ఖమ్మం జిల్లా పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టివేయాలని, కేసు తదుపరి విచారణను నిలిపివేయాలని కోర్టును అభ్యర్థించారు.