'చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదా' | Boora narsaiah goud takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

'చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదా'

Jun 19 2015 11:28 AM | Updated on Sep 3 2017 4:01 AM

'చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదా'

'చంద్రబాబుకు ఆ విషయం కూడా తెలియదా'

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నల్గొండ జిల్లా భువనగిరి లోక్సభ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్ శుక్రవారం హైదరాబాద్లో విరుచుకుపడ్డారు.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నల్గొండ జిల్లా భువనగిరి లోక్సభ సభ్యుడు బూర నర్సయ్య గౌడ్  శుక్రవారం హైదరాబాద్లో విరుచుకుపడ్డారు. ఓటుకు నోటు వ్యవహారంలో ఆరోపణలు నుంచి తప్పించుకోవడానికి చంద్రబాబు రోజుకో అంశాన్ని తెరపైకి తెస్తున్నారని నర్సయ్య గౌడ్ ఆరోపించారు. చంద్రబాబు ఇల్లు కట్టుకోవడానికి అనుమతి తీసుకోవాలని కూడా తెలియని స్థితిలో చంద్రబాబు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబు తీరుపై ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని బూర నర్సయ్య గౌడ్ అన్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement