బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న..
హైదరాబాద్: బీజేపీ మద్దతు లేకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎన్.రామచంద్రరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంలో ఆయన శనివారం హైదరాబాద్లో పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణలో పోలీస్ పాలన నడుస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు న్యాయవాదులు కీలకపాత్ర పోషించారని రామచంద్రావు అన్నారు. విద్యా వ్యవస్థను తెలంగాణ సర్కార్ నాశనం చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.