మిస్డ్‌కాల్‌తో బీజేపీ సభ్యత్వం | BJP membership Missed Call | Sakshi
Sakshi News home page

మిస్డ్‌కాల్‌తో బీజేపీ సభ్యత్వం

Nov 30 2014 1:37 AM | Updated on Mar 22 2019 6:24 PM

మిస్డ్‌కాల్‌తో బీజేపీ సభ్యత్వం - Sakshi

మిస్డ్‌కాల్‌తో బీజేపీ సభ్యత్వం

ఒక్క మిస్డ్ కాల్‌తో భారతీయ జనతాపార్టీ, అనుబంధ సంస్థలలో సభ్యత్వం పొందవ చ్చునని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, రాష్ట్ర మహిళా మోర్చా ఇన్‌చార్జ్ సాధ్వీ నందమయి పురి తెలిపారు.

  • రాష్ట్ర మహిళా మోర్చా ఇన్‌చార్జ్ సాధ్వీ నందమయి పురి
  • సాక్షి, హైదరాబాద్: ఒక్క మిస్డ్ కాల్‌తో భారతీయ జనతాపార్టీ, అనుబంధ సంస్థలలో సభ్యత్వం పొందవ చ్చునని పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, రాష్ట్ర మహిళా మోర్చా ఇన్‌చార్జ్ సాధ్వీ నందమయి పురి తెలిపారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదుపై నిర్వహించిన వర్క్‌షాప్ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    బీజేపీ సభ్యత్వ నమోదు కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18002662020 కు మిస్డ్‌కాల్ ఇచ్చిన వెంటనే సభ్యత్వ నమోదు జరిగిపోతుందన్నారు. ‘‘ఘర్‌ఘర్, గావ్ గావ్’’ నినాదంతో కార్యకర్తలు ముందుకు సాగి పెద్ద సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మహిళా మోర్చా రాష్ర్ట అధ్యక్షురాలు పద్మజారెడ్డి పాల్గొన్నారు.
     

Advertisement
 
Advertisement
Advertisement