నెలాఖరులో బీజేపీ సదస్సులు: లక్ష్మణ్‌ | BJP Conferences At The End Of The Month Says K Laxman | Sakshi
Sakshi News home page

నెలాఖరులో బీజేపీ సదస్సులు: లక్ష్మణ్‌

Dec 19 2019 2:11 AM | Updated on Dec 19 2019 2:11 AM

BJP Conferences At The End Of The Month Says K Laxman - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నిజ స్వరూపాన్ని బయట పెట్టేందుకు ఈ నెలాఖరులో చైతన్య సదస్సులు నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ తెలిపారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగిస్తూ మత రాజకీయాలకు పాల్పడుతున్న ఆ రెండు పార్టీలను ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని నగరాలు, పట్టణాల్లో మేధావులు, విద్యావంతులతో పెద్దఎత్తున సదస్సులు నిర్వహిస్తామని, వాటిల్లో పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు.ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో స్థిరపడిన పొరుగు రాష్ట్ర ప్రజలపై విషం చిమ్మిన కేసీఆర్‌ ఇప్పుడు పాక్‌ ముస్లింలకు వకాల్తా పుచ్చుకొని మోదీ ప్రభుత్వం తీసుకొచి్చన పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం విడ్డూరం గా ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement