
మెప్మాలో మరో బాగోతం
పట్టణ పేరిక నిర్మాలన సంస్థ (మెప్మా)లో అవినీతికి అంతేలేకుండా పోతోంది....
బినామీల పేరిట బ్యాంకు రుణాలు
ఖమ్మం సిటీ: పట్టణ పేరిక నిర్మాలన సంస్థ (మెప్మా)లో అవినీతికి అంతేలేకుండా పోతోంది. బినామీ గ్రూపుల ఏర్పాటు, విద్యార్థుల పేరిట ఉపకార వేతనాల స్వాహా లాంటి బాగోతాలు ఇప్పటికే వెలుగుచూడగా తాజాగా బ్యాంకు రుణాల వ్యవహారం మెప్మా అధికారుల వైఖరికి అద్దం పడుతోంది. అర్బన్ సెల్ఫ్ ఎంప్లాయీమెంట్ పథకం (యూఎస్‌ఈపీ) ద్వారా 2007 నుంచి రూ. 25 లక్షలకు పైగా రుణాలు పొంది ఇప్పటి వరకూ చెల్లించని 40 మంది జాబితాను బాంకర్లు మెప్మా అధికారులకు అందించారు.
దీనిపై మెప్మా అధికారులు నగరంలో శుక్రవారం విచారణ ప్రారంభించారు. పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. అయితే.. ఈ రుణాల్లోనూ అవినీతి చోటుచేసుకుందని తెలుస్తోంది. గ్రూపు సభ్యుల పేరిట సీఓ రిసోర్‌స పర్సన్లే రుణాలు పొందినట్లు సమాచారం. బ్యాంకర్లతో కుమ్మక్కై ఇలా అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. యూఎస్‌ఈపీలో 25 శాతం సబ్బిడీ వర్తిస్తుండడంతో బినామీ రుణాలు పొందేందుకు కమ్యూనిటీ ఆర్గనైజర్లు (సీపీ), రిసోర్స్‌పర్సన్లు (ఆర్‌పీ) ప్రణాళికలు రచించారని తెలుస్తోంది.
బినా మీ గ్రూపులు ఏర్పాటు చేసి కొంత మంది సభ్యుల పేరుతో స్వయం ఉపాధి పథకం కింద కూడా రుణాలు పొందినట్లు సమచారం. ఈ అవినీతిలో సీవో, ఆర్‌పీలే ప్రధాన పాత్ర పోషించడం గమనార్హం. వీరికి బ్యాంకు అధికారులు కూడా సహకరించడంతో అవినీతికి అడ్డు లేకుండా పోయిం దని తెలుస్తోంది.
విచారణ చేస్తున్నాం
వేణుహనోహర్‌రావు, మెప్మా,పీడీ
వ్యక్తిగత రుణాలు పొంది చెల్లించని వారిపై నగరంలో విచారణ చేస్తున్న మాట వాస్తమే. అక్రమార్కులు ఎవరనేది తేలాక వారిపై చర్యలు తీసుకుంటాం.