రాజకీయ కాంక్షతోనే ప్రజల్లో ఉన్నారు | bhatti vikramarka coments on kodandaram | Sakshi
Sakshi News home page

రాజకీయ కాంక్షతోనే ప్రజల్లో ఉన్నారు

Nov 16 2017 4:51 AM | Updated on Oct 8 2018 9:21 PM

bhatti vikramarka coments on kodandaram - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయకాంక్ష లేకుంటే ఎవరైనా ప్రజల్లో ఎందుకు తిరుగుతారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క ప్రశ్నించారు. అసెంబ్లీ లాబీలో బుధవారం విలేకరులు కోదండరాం పార్టీ గురించి, కాంగ్రెస్‌లోకి కోదండరాంను ఆహ్వానించినట్టుగా జరుగుతున్న ప్రచారం గురించి ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు. కాంగ్రెస్‌ భావజాలం నచ్చినవారెవరైనా పార్టీలో చేరతారని.. దీనికి ఎవరికీ, ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు ఉన్నవారెవరైనా పార్టీ పెట్టుకోవచ్చునన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement