ఎలుగుబంటితో ఫైట్ చేశాడు | Bear attacks man | Sakshi
Sakshi News home page

ఎలుగుబంటితో ఫైట్ చేశాడు

Sep 28 2015 5:51 PM | Updated on Sep 3 2017 10:08 AM

అడవికి వెళ్లి వస్తున్న గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. అదే సమయంలో గిరిజనుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించడంతో.. ఎలుగు పరారైంది.

దండేపల్లి (ఆదిలాబాద్) : అడవికి వెళ్లి వస్తున్న గిరిజనుడిపై ఎలుగుబంటి దాడి చేసింది. అదే సమయంలో గిరిజనుడు అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించడంతో.. ఎలుగు పరారైంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట గ్రామంలో సోమవారం జరిగింది.

గ్రామానికి చెందిన మల్లయ్య(41) వెదురు బద్దల కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా.. ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో అప్రమత్తమైన మల్లయ్య తన చేతిలో ఉన్న కత్తితో ఎలుగుపై తిరగబడటంతో.. అది తోకముడిచింది ఈ దాడిలో మల్లయ్యకు చేతికి, వీపుకు గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement