భూపాలపల్లిలో శనివారం బీసీ చైతన్య సదస్సు ఏర్పాటు చేసినట్లు బీసీ సంఘం నేత తెలిపారు.
ఈ మేరకు భూపాలపల్లిలో 30వ తేదీన జరగనున్న సదస్సులో సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. సదస్సుకు రాజకీయాలకతీతంగా బీసీ ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, యువత, విద్యార్థులు హాజరుకావాలని కోరారు. దొడ్డపల్లి రఘుపతి, తాళ్ల సంపత్‌కుమార్, సబ్బు అనిల్‌కుమార్, ఇందారపు మహేష్‌కుమార్, చిట్యాల పురుషోత్తం, నాగపురి పవన్‌కుమార్ పాల్గొన్నారు.