వైద్యం ముసుగులో పసికందుల విక్రయం | babys Sale in Medical mask at Khammam | Sakshi
Sakshi News home page

వైద్యం ముసుగులో పసికందుల విక్రయం

Jun 30 2017 1:00 AM | Updated on Sep 5 2017 2:46 PM

పసికందుల విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. వరంగల్‌లో బీఏఎంఎస్‌ చదివిన ఆర్‌.శ్రీనివాస్‌.. మహబూబాబాద్‌ జిల్లా కురవిలో 20 ఏళ్లుగా శ్వేత నర్సింగ్‌ హోం నిర్వహిస్తున్నాడు.

ఖమ్మం సహకారనగర్‌: పసికందుల విక్రయాల గుట్టును పోలీసులు రట్టు చేశారు. వరంగల్‌లో బీఏఎంఎస్‌ చదివిన ఆర్‌.శ్రీనివాస్‌.. మహబూబాబాద్‌ జిల్లా కురవిలో 20 ఏళ్లుగా శ్వేత నర్సింగ్‌ హోం నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పిల్లలు లేని దంపతులు అతడిని సంప్రదిస్తే.. వారికి పసికందులను విక్రయించడమే పనిగా పెట్టుకున్నాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఏపీ రాష్ట్రంలో కూడా పిల్లలను అమ్మ డం మొదలుపెట్టాడు. ఈ విషయం ఖమ్మం పోలీసుల విచారణలో గురువారం వెల్లడైంది.

 ఖమ్మంలోని జయనగర్‌ కాలనీకి చెందిన గుంటూరు భానుప్రసాద్, రాణిలకు సంతానం లేకపోవడంతో శ్రీనివాస్‌ను ఆశ్రయిం చారు. ఈ క్రమంలో నేరడ తండాకు చెందిన ఓ మహిళను జన్మించిన పాపను కొనుగోలు చేసి.. ఆ దంపతులకు ఇచ్చాడు. డెలివరీ ఖర్చులకుగాను రూ.50వేలు తీసుకున్నట్లు తెలిసింది. అయితే, పిల్లలు లేని భానుప్రసాద్‌ దంపతులు పాపను తెచ్చి పెంచుకుంటుండడంతో అనుమానం వచ్చిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు సమాచారం అందించారు.

అర్బన్‌ సీఐ నాగేంద్రాచారి ఆధ్వర్యంలో ఎస్సై రాము దర్యాప్తు చేసి.. శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా.. విషయం బయటపడింది. ఇప్పటివరకు ఏడుగురు పిల్లలను విక్రయించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. శ్రీనివాస్‌ లింగనిర్ధారణ పరీక్షలు, అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణపై చెందిన నర్సింగ్‌ హోంను అధికారులు సీజ్‌ చేశారు.

Advertisement
Advertisement