బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య | Btech Student Commits Suicide In Warangal | Sakshi
Sakshi News home page

బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య

Jul 27 2019 11:54 AM | Updated on Jul 27 2019 11:56 AM

B tech Student Commit Suicide In Warangal - Sakshi

నిశాంత్‌ మృతదేహం

సాక్షి, వరంగల్‌ అర్బన్‌ : పరీక్షలు ఫెయిల్‌ కావడంతో బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. వంగర ఎస్సై ఉపేందర్‌ కథనం ప్రకారం వంగర గ్రామానికి చెందిన వొల్లాల రమేష్‌–రాణి దంపతుల రెండో కుమారుడైన వొల్లాల నిశాంత్‌(21) హైదరాబాద్‌లో బీటెక్‌ తృతీయ సంవత్సరం చదవుతున్నాడు. ఇటీవల కాలేజీ నుంచి ఇంటికొచ్చాడు. సప్లిమెంటరీ ఫలితాల్లో ఒక సబ్జెక్ట్‌లో ఫెయిల్‌ కావడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున నిశాంత్‌ తండ్రి రమేష్‌ పని నిమిత్తం హైదరాబాద్‌కు, తల్లి వ్యవసాయ పనుల కోసం బావి వద్దకు వెళ్లారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న నిశాంత్‌ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుమారుని మృతదేహంపై పడి తల్లిదండ్రులు రమేష్, రాణి రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement