Minister KTR Launches Bheemadevarapally Branch Movie - Sakshi
Sakshi News home page

టీజర్‌ ఆకట్టుకుంది – మంత్రి కేటీఆర్‌

Feb 10 2023 1:25 AM | Updated on Mar 9 2023 2:50 PM

KTR Launches Bheemadevarapally Branch Movie - Sakshi

‘‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా టీజర్‌ ఆకట్టుకుంది. మంచి కథాంశంతో పాటు చక్కని సందేశం ఉన్న చిత్రం అని అర్థమవుతోంది. ఈ సినిమాను తప్పకుండా చూస్తాను’’ అని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు.ప్రొఫెసర్‌ నాగేశ్వర్, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, అద్దంకి దయాకర్, అంజి వల్గుమాన్, రాజవ్వ, సుధాకర్‌ రెడ్డి, కీర్తీలత గౌడ్‌ నటించిన చిత్రం ‘భీమదేవరపల్లి బ్రాంచి’. రమేష్‌ చె΄్పాల దర్శకత్వంలో డా.బత్తిని కీర్తిలతా గౌడ్, రాజా నరేందర్‌ చెట్లపెల్లి నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ను కేటీఆర్‌ విడుదల చేశారు. ‘‘ఓ మంచి విషయాన్ని రమేష్‌ చెప్పాల  వినోదాత్మకంగా చెప్పారు’’ అన్నారు కీర్తిలతా గౌడ్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement