నిజామాబాద్ జిల్లా పిట్లాం మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు.
పిట్లాం (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా పిట్లాం మండల కేంద్రంలోని ఆంధ్రా బ్యాంకులో చోరీకి దుండగులు విఫలయత్నం చేశారు. ఈ ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది.
వివరాల ప్రకారం.. మండల కేంద్రంలో ఉన్న ఆంధ్రా బ్యాంకులోకి శనివారం అర్ధరాత్రి తర్వాత చొరబడిన దుండగులు నగదును ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే సైరన్ మోగడంతో దుండగులు పరారయ్యారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.