రాష్ట్రావతరణ ఏర్పాట్లు చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

రాష్ట్రావతరణ ఏర్పాట్లు చేసుకోవాలి

Published Sun, May 22 2016 2:25 AM

రాష్ట్రావతరణ ఏర్పాట్లు చేసుకోవాలి - Sakshi

అధికారులను ఆదేశించిన కలెక్టర్ శ్రీదేవి
 
 మహబూబ్‌నగర్ న్యూటౌన్: జూన్ 2న వైభవంగా నిర్వహించే రాష్ట్ర అవతరణ వేడుకలకు ముందస్తుగా ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ టీ.కే. శ్రీదేవి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ నుంచి ఏజేసీ బాలాజీ రంజిత్‌ప్రసాద్ అన్ని మండలాల అధికారులతో వీడియోకాన్ఫరెన్‌‌స నిర్వహించారు. ఫరూఖ్‌నగర్ మండల తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ వీసీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారం రోజుల ముందు నుంచే గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి జూన్2లోపు పండుగ వాతావరణం తీసుకురావాలని సూచిం చారు. నిర్ణయించిన సమయానికే జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని తెలిపారు. దేవాలయాలు, మసీదులను విద్యుద్దీపాలతో అలంకరించి రాష్ట్ర అభివృద్ధికి ప్రార్ధనలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంక్షేమ హాస్టళ్లు, అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాల్లో పండ్లు, స్వీట్లు, బట్టలు పంపిణీ చేయాలని, రెడ్‌క్రాస్ సొసైటీ సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించాలన్నా రు. అమరవీరుల కుటుంబాలను సత్కరించాలని, ప్రధాన కూడళ్లలో స్వాగత తోరణాలు, విద్యుద్దీపాలతో అలంకరించాలని అధికారులకు తెలిపారు.


వేడుకల్లో ప్రజా ప్ర తినిధులు, స్వాతంత్య్ర సమరయోధులు, మేధావులు, ప్రజలందరూ పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాలు తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉండాలన్నారు. కవిసమ్మేళనాలు, ఆటల పోటీలు, వ్యాసరచన పోటీలు నిర్వహించాలన్నారు. అవార్డుల కోసం వివిధ  రంగాల్లో విశిష్ట సేవలందించిన వారు వెబ్‌సైట్  జ్ట్టిఞ://్టజఝఛట.ఞ్చ్ఛఠిజీజ్చుట్చఝ.జీ లో దరఖాస్తులను ఈ నెల 22 నుంచి 26 వరకు సమర్పించుకోవాలని సూచించారు. అనంతరం ఏజేసీ బాలాజి రంజిత్ ప్రసాద్ మాట్లాడుతూ త్యాగాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందని, బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ  కృషి చేయాలన్నారు. వీసీలో డీఆర్‌ఓ భాస్కర్, డీసీఓ వెం కటేశ్వర్లు, మున్సిపల్ చెర్మైన్ దేవ్‌సింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement