ఫీవర్‌ ఆస్పత్రిలో 51 కుక్కకాటు కేసులు | Around 51 Dog bite cases are reported at Fever Hospital | Sakshi
Sakshi News home page

ఫీవర్‌ ఆస్పత్రిలో 51 కుక్కకాటు కేసులు

Jan 18 2016 7:46 PM | Updated on Jun 13 2018 8:02 PM

స్థానిక ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం 51 కుక్కకాటు కేసులు నమోదు కాగా వీరిలో పదేళ్లలోపు చిన్నారులు 15 మంది ఉన్నారు.

నల్లకుంట (హైదరాబాద్) : స్థానిక ఫీవర్ ఆస్పత్రిలో సోమవారం 51 కుక్కకాటు కేసులు నమోదు కాగా వీరిలో పదేళ్లలోపు చిన్నారులు 15 మంది ఉన్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుక్కకాటు బాధితుల ఒంటిపై గాయాలను శుభ్రం చేసిన అక్కడి వైద్యులు రిగ్ ఇంజక్షన్ ఇచ్చి పంపేశారు.

అలాగే ఓపీ విభాగంలో 930 మంది రోగులు వైద్య పరీక్షలు చేయించుకోగా వీరిలో 30 మందిని ఇన్ పేషంట్లుగా చేర్చుకుని చికిత్సలు అందిస్తున్నామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇన్ పేషంట్లుగా చేరి చికిత్సలు పొందుతున్న వారిలో మూడు డిఫ్తీరియా కేసులున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement