74 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం

Appointment of 74 Assistant Professors - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వైద్య విద్య డైరెక్టరేట్‌ పరిధి లోని బోధనాసుపత్రుల్లో 74 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకం జరిగింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ఖాళీగా ఉన్న 225 అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల భర్తీకోసం శుక్రవారం కౌన్సెలింగ్‌ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ, వైద్య విధాన పరిషత్‌ ఆసుపత్రుల్లో ఇప్పటికే సివిల్‌ సర్జన్లుగా పనిచేస్తున్న డాక్టర్లను సీనియారిటీ ప్రకారం కౌన్సెలింగ్‌కు ఆహ్వానించారు. 25 స్పెషాలిటీలకు 350 మందిని కౌన్సెలింగ్‌కి పిలిచారు.

హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో 45, గాంధీలో 9, వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కళాశాలలో 28, నిజామాబాద్‌ జీఎంసీలో 18, సిద్దిపేట జీఎంసీలో 10, ఆదిలాబాద్‌ రిమ్స్‌లో ఏడు పోస్టులతోపాటు, కొత్తగా ఏర్పాటు చేస్తున్న నల్లగొండ జీఎంసీ కోసం 49, సూర్యాపేట జీఎంసీ కోసం 44 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల అవసరముంది. అనస్థీషియా, అనాటమీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌ స్పెషాలిటీలకు అర్హులైన డాక్టర్ల కొరత ఉంది. ప్రస్తుతం 74 పోస్టులు భర్తీ కాగా మిగిలిన వాటిని డిప్యుటేషన్‌ లేదా కాంట్రాక్టు పద్ధతిలో నియమించనున్నారు. ప్రస్తుతం ఎంపి క చేసిన వారికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top