
సాక్షి, హైదరాబాద్: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 20వ పశుగణనను ఫిబ్రవరి 15లోగా పూర్తి చేయాలని పశుసంవర్థక శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పశుసంవర్థక శాఖ, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య, రాష్ట్ర పశుగణాభివృద్ధి సంస్థలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48 శాతం పశుగణన పూర్తి అయిందని తెలిపారు. రాష్ట్రంలోని పశువైద్యశాల భవనాలకు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గొర్రెల నట్టల నివారణ మూడో విడత కార్యక్రమం ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ సంచాలకులు డా.వెంకటేశ్వర్లు, ముఖ్య కార్యనిర్వహణ అధికారి డా.మంజువాణి తదితరులు పాల్గొన్నారు.