
స్ఫూర్తినింపిన అమిత్‌షా పర్యటన
హైదరాబాద్‌లో ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగిన బీజేపీ రాష్ట్ర సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన సందేశం కార్యకర్తల్లో స్ఫూర్తి నింపిందని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు.
నిర్మల్ అర్బన్ : హైదరాబాద్‌లో ఈ నెల 21, 22వ తేదీల్లో జరిగిన బీజేపీ రాష్ట్ర సమావేశంలో జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇచ్చిన సందేశం కార్యకర్తల్లో స్ఫూర్తి నింపిందని ఆ పార్టీ తెలంగాణ ఉద్యమ కమిటీ రాష్ర్ట కో కన్వీనర్ రావుల రాంనాథ్ అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనను ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి పట్టం కడుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఒడిసెల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు అయ్యన్నగారి రాజేందర్, రాష్ట్ర నాయకులు పంతికే ప్రకాష్, బీజేవైఎం జిల్లా నాయకులు రచ్చ మల్లేష్, నాయకుడు ప్రేంకుమార్ తదితరులు పాల్గొన్నారు.