
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ మాజీ చీఫ్ అమిత్‌షా మార్చి 15న రాష్ట్రానికి రానున్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న పౌరసత్వ చట్ట సవరణ (సీఏఏ) అనుకూల సభలో ఆయన పాల్గొంటారు. ఇందుకోసం బీజేపీ నాయకత్వం ఎల్బీ స్టేడియం అధికారులను కూడా సంప్రదించింది. అయితే, అమిత్‌షా నేతృత్వంలో ఇప్పుడు బీజేపీ సీఏఏకు అనుకూలంగా సభ నిర్వహించడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. కాగా, ఈ సభకు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ కూడా హాజరవుతారని తెలుస్తోంది.
ఆరు జిల్లాలపై ఏకాభిప్రాయం
పార్టీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై చర్చించేందుకుగాను మంగళవారం ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్యులతో బీజేపీ రాష్ట్ర ముఖ్యనేతలు సమావేశమయ్యారు. ఈ చర్చల తర్వాత మంచిర్యాల, కరీంనగర్, వేములవాడ, మెదక్, రంగారెడ్డి, గద్వాల జిల్లాల అధ్యక్షుల ఎంపికపై ఏకాభిప్రాయం వచ్చినట్టు సమాచారం.