ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి నిప్పు | alimineti madhava reddy statue damaged in nalgonda | Sakshi
Sakshi News home page

ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి నిప్పు

Jul 30 2015 9:37 AM | Updated on Sep 5 2018 9:45 PM

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడులో మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు.

చిట్యాల(నల్లగొండ): నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెల్మినేడులో మాజీ హోంమంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. గ్రామంలో టీడీపీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని ఇంకా ఆవిష్కరించలేదు. ఈ నేపథ్యంలోనే విగ్రహానికి ఉన్న ముసుగుకు బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించటంతో నల్లగా కాలి మసకబారింది. విగ్రహానికి ఎటువంటి నష్టం కలగలేదు. కాగా, విగ్రహాన్ని త్వరలోనే ఆవిష్కరణ చేసేందుకు పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement