వ్యవసాయ రుణాల లక్ష్యం పూర్తిచేయాలి | Agriculture Loans Target Should Be Reached | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రుణాల లక్ష్యం పూర్తిచేయాలి

Mar 23 2018 2:20 PM | Updated on Feb 17 2020 5:11 PM

Agriculture Loans Target Should Be Reached - Sakshi

మాట్లాడుతున్న కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌

మంచిర్యాలసిటీ : మంచిర్యాల జిల్లాకు కేటాయించిన రైతుల రుణాల లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశించారు. గురువారం ఆయన తన కార్యాలయంలో లీడ్‌బ్యాంక్‌ మేనేజర్లు,  స్వయం సహాయక బృందాలు, ఎంపీడీవో, ఏపీఎంలు, డీఆర్‌డీఏ, సంక్షేమ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ రుణాల లక్ష్యాన్ని చేరుకునేందుకు బ్యాంక్, వ్యవసాయశాఖ, సంక్షేమ శాఖ, అధికారులు సమన్వయంతో కేటాయించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. బ్యాంకు ఖాతాదారులకు ఆధార్‌ అనుసంధానం జిల్లాలో 87.84 శాతం పూర్తయ్యిందన్నారు. బ్యాంకుల వారీగా అనుసంధానం వందశాతం పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి యోజన పథకం, సురక్ష భీమా యోజన పథకాలను ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.

మండల స్థాయిలో ఫీల్డ్, టెక్నికల్‌ అసిస్టెంట్, ఆశ, ఏఎన్‌ఎంలు ప్రధానమంత్రి యోజన పథకం లక్ష్యాన్ని పూర్తి చేయాలి. బ్యాంకు అధికారులు ఉపాధిహామీ పథకం కూలీలకు జీరో అకౌంట్‌తోనే వారి వేతనాలను చెల్లించాలని కోరారు. జిల్లాలోని 23 బ్యాంక్‌లతో 105 శాఖల ద్వారా 2017–18లో 88.12 ఆతం సిడీఓ రుణాలు అందించడం జరిగిందన్నారు. పంట రుణాల లక్ష్యం రూ:1,22,719.38 లక్షలకుగాను రూ: 75,595,44 పంపిణీ చేశామన్నారు. అదే విధంగా వ్యవసాయ రుణాలు 53.82 శాతం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు  46.32 శాతం రుణాలు ఇచ్చామని కలెక్టర్‌ వివరించారు. నాబార్డు ద్వారా డైరీ, కూరగాయల పంట అభివృద్ధికి రుణాలు ఇవ్వడానికి ప్రణాళికలు రూపొందించామన్నారు. సమావేశంలో ఆర్‌బీఐ ఎల్‌డీఓ అనిల్‌కుమార్, లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ హెచ్‌ రాజు, ఆంధ్రాబ్యాంక్‌ ఏజీఎం జయచంద్రన్, ఆర్‌ఎం వెంకటకుమార్‌ పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement