ప్రభుత్వ విధానాలపై ఉద్యమించండి: మాణిక్ సర్కార్
వ్యవసాయ కార్మికులకు అనుబంధ రంగాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అవలంభిస్తుందని...
వరంగల్: వ్యవసాయ కార్మికులకు అనుబంధ రంగాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం విధానాలను అవలంభిస్తుందని త్రిపుర సీఎం మాణిక్య సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారి, కార్పొరేట్ సంస్థలను కాపాడే విధంగా ఉందంటూ ఆయన విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులంతా ఉద్యమానికి సిద్ధం కావాలని మాణిక్ సర్కార్ పిలుపునిచ్చారు.
హితవాదం వైపు ప్రభుత్వం ప్రయాణిస్తుందని, దీనివల్లే దేశంలో మతఘర్షణలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాలు మైనార్టీ వ్యతిరేకంగా ఉన్నాయని, ఇది మంచిది కాదని త్రిపుర సీఎం మాణిక్య సర్కార్ తెలిపారు.