సినీనటి శ్రీ లక్ష్మి గొలుసు అపహరణ | actress Sri Lakshmi chain abduction | Sakshi
Sakshi News home page

సినీనటి శ్రీ లక్ష్మి గొలుసు అపహరణ

Oct 2 2014 1:11 AM | Updated on Sep 2 2017 2:14 PM

సినీనటి శ్రీలక్ష్మికి చెందిన నగలను ఓ చైన్‌స్నాచర్ అపహరించాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో యూసుఫ్‌గూడ వద్ద జరిగింది.

కొనుగోళ్లు జరిపి వస్తుండగా ఘటన

హైదరాబాద్: సినీనటి శ్రీలక్ష్మికి చెందిన నగలను ఓ  చైన్‌స్నాచర్ అపహరించాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో  యూసుఫ్‌గూడ వద్ద జరిగింది. ఎస్‌ఆర్‌నగర్ పోలీసుల కథనం మేరకు... శ్రీలక్ష్మి , మరోనటి అన్నపూర్ణతో కలిసి తన కారులో శ్రీనగర్‌కాలనీ నుంచి యూసుఫ్‌గూడకు వెళ్తూ దారిలో ఆర్‌బీఐ క్వార్టర్స్ సమీపంలో కారును నిలిపి రోడ్డు అవతల ఉన్న అయ్యంగార్ బేకరీలో కొనుగోళ్లు జరిపారు. వారు  తిరిగి  వచ్చాక  కారులో అన్నపూర్ణ వెనక సీట్లో కూర్చోగా డ్రైవర్ సీటు ఉన్న డోర్‌ను శ్రీలక్ష్మీ  తెరుస్తున్నప్పుడు వెనుక నుంచి నుంచి వచ్చిన ఆగంతకుడు ఆమె మెడలోని 8 తులాల నగలను లాక్కుని, కొద్ది దూరంలో బైక్‌పై సిద్ధంగా ఉన్న అతని అనుచరుడితో కలిసి యూసుఫ్‌గూడ వైపు పారిపోయాడు.

ఈ ఘటనతో  శ్రీలక్ష్మి కొద్దిసేపటి వరకు తేరుకోలేకపోయారు.అనంతరం ఆమె ఎస్‌ఆర్‌నగర్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీఐ శంకర్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలం నుంచి యూసుఫ్‌గూడ వరకు ఉన్న సీసీకెమెరా ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా శ్రీలక్ష్మి సాయం కోసం 100కు ఫోన్‌చేసినా పోలీసులు సకాలంలో స్పందించ లేదని తెలుస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement