ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ | acb caught revenue inspector in jaheerabad | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌

Mar 31 2015 6:26 PM | Updated on Sep 22 2018 8:22 PM

భూవివాదంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఆర్‌ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

మెదక్ (జహీరాబాద్ ) : భూవివాదంలో ఓ రైతు నుంచి లంచం తీసుకుంటున్న ఆర్‌ఐని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. మెదక్ జిల్లా జహీరాబాద్ తహశీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న దత్తారెడ్డి లంచం తీసుకుంటూ మంగళవారం సాయంత్రం ఏసీబీ అధికారులకు చిక్కారు. ముఖ్తావలి బాబా దర్గాకు చెందిన భూవివాదంలో ఓ రైతు నుంచి నాలుగు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు అదనపు సమాచారాన్ని సేకరిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement