రోహింగ్యాకు అక్రమంగా ‘ఆధార్‌’ | 'Aadhar' to Rohingya illegally | Sakshi
Sakshi News home page

రోహింగ్యాకు అక్రమంగా ‘ఆధార్‌’

Oct 16 2017 1:06 AM | Updated on May 25 2018 6:12 PM

'Aadhar' to Rohingya illegally  - Sakshi

కేసు వివరాలు వెల్లడిస్తున్న ఏసీపీ ఎస్‌.మల్లారెడ్డి

హైదరాబాద్‌: తప్పుడు పత్రాలతో ఆధార్‌కార్డు పొందిన రోహింగ్యా ముస్లింతోపాటు అతడికి సహకరించిన పశ్చి మ బెంగాల్‌వాసిని బాలాపూర్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వనస్థలిపురం ఇన్‌చార్జ్‌ ఏసీపీ ఎస్‌.మల్లారెడ్డి ఆదివా రం ఇక్కడ కేసు వివరాలు వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన రియాజుద్దీన్‌ మొల్లా(36) వస్త్ర వ్యాపారి. వ్యాపార నిమిత్తం ఏడాది క్రితం బంగ్లాదేశ్‌కు వెళ్లినప్పుడు అక్కడ మయన్మార్‌ దేశానికి చెందిన శరణార్థి మహ్మద్‌ ఎజాముద్దీన్‌ అలియాస్‌ మొల్లా ఎజాముద్దీన్‌ (19) పరిచయమయ్యాడు.

పశ్చిమ బెంగాల్‌కు వస్తే మంచి వేతనంతో కూడిన పని ఇస్తానంటూ ఎజాము ద్దీన్‌కు ఆశచూపి ఫోన్‌ నంబర్‌ ఇచ్చాడు. దీంతో ఎజా ముద్దీన్‌ కోల్‌కతా వచ్చి అతడిని కలిశాడు. శరణార్థికి  రియాజుద్దీన్‌ నెలకు రూ.6 వేల వేతనం ఇచ్చి పని చేయించుకోవటంతో పాటు తన కుమారుడంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో   ఆధార్‌ కార్డు (5893 0394 1315) ఇప్పించాడు.

గత బక్రీద్‌ సందర్భంగా వ్యాపార నిమిత్తం ఎజాముద్దీన్‌ను హైదరాబాద్‌కు తీసుకువచ్చి బాలాపూర్‌ రాయల కాలనీలో ఉన్న శరణార్థుల ఆశ్రమంలో చేర్పించాడు. విశ్వసనీయ సమాచారం మేరకు బాలాపూర్‌ పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేసి ఆధార్‌ కార్డులను, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement