కలుపు మొక్కలు తీసేందుకు కాడెద్దుగా.. | A true tragedy | Sakshi
Sakshi News home page

కలుపు మొక్కలు తీసేందుకు కాడెద్దుగా..

Jun 27 2016 4:14 AM | Updated on Oct 1 2018 2:00 PM

కలుపు మొక్కలు తీసేందుకు కాడెద్దుగా.. - Sakshi

కలుపు మొక్కలు తీసేందుకు కాడెద్దుగా..

పంట సాగులో పెరిగిన కలుపు మొక్కలు తీసేందుకు ఓ మహిళ కాడెద్దుగా మారింది.

మర్పల్లి: పంట సాగులో పెరిగిన కలుపు మొక్కలు తీసేందుకు ఓ మహిళ  కాడెద్దుగా మారింది. రంగారెడ్డి జిల్లా మర్పల్లికి చెందిన మొల్లయ్యకు వ్యవసాయ భూమి తక్కువగా ఉండడంతో అదే గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రెండెకరాలు కౌలుకు తీసుకున్నాడు. వర్షాలు కురవడంతో అద్దె అరకతో మొక్కజొన్న విత్తనాలు వేశాడు. మొక్కజొన్న పంటలో కలుపు మొక్కలు పెరిగాయి.

ఎంతకూ కాడెడ్లు అద్దెకు దొరకకపోవడంతో అతని భార్య మొల్లమ్మ కాడుద్దుగా మారి కలుపు మొక్కలు తీసే పరికరాన్ని లాగింది. ఆదివారం ఇలా అరెకరంలో వారు కలుపు మొక్కలు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement