యువకుడి ఆత్మహత్య | a man suicides in nizamabad | Sakshi
Sakshi News home page

యువకుడి ఆత్మహత్య

Aug 9 2015 7:31 PM | Updated on Nov 6 2018 7:56 PM

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలో కోటగిరి పవన్ (29) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండల కేంద్రంలో కోటగిరి పవన్ (29) అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం మధ్యాహ్నం అయ్యప్పగనర్‌లోని తన ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పవన్ గత కొంతకాలంగా గల్ఫ్‌లో ఉంటున్నాడు. మూడు రోజుల క్రితమే స్వగ్రామానికి వచ్చాడు. ఇంతలోనే ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

పవన్ ఆత్మహత్యతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. పవన్ కు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన యువతితో కొన్నేళ్ల క్రితం వివాహమయ్యింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఏడాదిగా వీరిద్దరూ దూరంగా ఉంటున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే, కుటుంబ కలహాలే ఆత్మహత్యకు కారణమా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement