దంపతుల ప్రాణం తీసిన పందుల వేట..! | a man died due to pig hunt | Sakshi
Sakshi News home page

దంపతుల ప్రాణం తీసిన పందుల వేట..!

Apr 19 2015 2:52 AM | Updated on Jul 10 2019 7:55 PM

పందులవేటకు వినియోగిస్తున్న డిటోనేటర్ పేలి భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు.

నాగర్‌కర్నూల్ రూరల్: పందులవేటకు వినియోగిస్తున్న డిటోనేటర్ పేలి భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. ఈ ఘటన శనివారం మహబూబ్‌నగర్ జిల్లా నాగర్‌కర్నూ ల్ మండలం గుడిపల్లి మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు సమీపంలో జరిగింది. నల్లగొండ జిల్లా దేవరకొండకు చెందిన లింగయ్య(45), అతని భార్య ఇంద్రమ్మ(40) మరికొందరు కొద్దిరోజులుగా గుడిపల్లిగుట్టలో అడవిపందుల వేట సాగిస్తున్నారు.

శనివారం వీరంతా గుట్ట వద్దకు వెళుతుండగా వారు వెంట తెచ్చుకున్న టిఫిన్‌బాక్స్‌లో ఉంచిన డిటోనేటర్ పేలింది. లింగయ్య అక్కడికక్కడే మృతిచెందగా.. ఇంద్రమ్మ నాగర్‌కర్నూల్ ఏరియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement