విద్యార్థి అదృశ్యం | 9th class student missing | Sakshi
Sakshi News home page

విద్యార్థి అదృశ్యం

Oct 30 2015 6:34 PM | Updated on Sep 3 2017 11:44 AM

కడెం మండలం ముర్రిగూడెం గ్రామానికి చెందిన సాయిచంద్(13) అనే బాలుడు అదృశ్యమయ్యాడు.

కడెం (ఆదిలాబాద్ జిల్లా) : కడెం మండలం ముర్రిగూడెం గ్రామానికి చెందిన సాయిచంద్(13) అనే బాలుడు అదృశ్యమయ్యాడు. గ్రామానికి చెందిన సాయిచంద్ అల్లంపల్లిలోని గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన సాయిచంద్‌ను తండ్రి గురువారం సాయంత్రం బీర్‌సాయిపేట స్టేజీ వద్ద వదిలివెళ్లాడు. అక్కడి నుంచి అల్లంపల్లి పాఠశాలకు ఆటోలో వెళ్లిపోవచ్చు.

అయితే సాయిచంద్ పాఠశాలకు రాలేదని.. అదే స్కూల్‌లో చదువుతున్న మరో విద్యార్థి శుక్రవారం సాయిచంద్ తల్లిదండ్రులకు తెలిపాడు. ఇంటికి కూడా రాకపోవడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం కడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement