నాలుగు రోజులుగా జ్వరం వస్తున్నా సరైన వైద్యం చేయించుకోకపోవడంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు.
జైనూరు (ఆదిలాబాద్ జిల్లా) : నాలుగు రోజులుగా జ్వరం వస్తున్నా సరైన వైద్యం చేయించుకోకపోవడంతో తొమ్మిదేళ్ల బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటన గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనూరు మండలం కర్ణంగూడ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కర్ణంగూడ గ్రామానికి చెందిన శ్యాంకుమార్(9) మూడవ తరగతి చదువుతున్నాడు.
కాగా గత నాలుగు రోజులుగా జ్వరం రావడంతో తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చూపించారు. అయితే, సరైన వైద్యం అందకపోవడంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై గురువారం మృతి చెందాడు. బాలుడి మృతితో తల్లిదండ్రులు బోరున విలపించారు.