ఆరేళ్లకే తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ | 6 years old girl gets Black belt Taekwondo | Sakshi
Sakshi News home page

ఆరేళ్లకే తైక్వాండోలో బ్లాక్ బెల్ట్

Jun 1 2015 7:12 PM | Updated on Sep 3 2017 3:03 AM

ఓ చిన్నారి ఆరేళ్లకే తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది.

మహబూబ్‌నగర్ : ఓ చిన్నారి ఆరేళ్లకే తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని అయోధ్యనగర్ కాలనీకి చెందిన చిన్నారి కోట్ల సాయి సంస్కృతి తైక్వాండోలో బ్లాక్ బెల్ట్ సాధించింది. ఈ సందర్భంగా సోమవారం ఎంపీ జితేందర్‌రెడ్డి తన నివాసంలో చిన్నారిని సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. చిన్న వయస్సులోనే బ్లాక్ బెల్ట్‌ను సాధించడం జిల్లాకే గర్వకారణమన్నారు. భవిష్యత్తులో మరిన్న విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సాయి సంస్కృతి విజయాన్ని లిమ్కా బుక్‌ ఆఫ్ రికార్డులో ఎక్కించేందుకు తన వంతుగా ప్రయత్నం చేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement