583 గ్రాముల బంగారం స్వాధీనం | 583 grams gold seized in shamshabad airport | Sakshi
Sakshi News home page

583 గ్రాముల బంగారం స్వాధీనం

Jun 10 2015 9:43 AM | Updated on Sep 3 2017 3:31 AM

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్: రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ ప్రయాణికురాలి నుంచి కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దుబాయి నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చిన ప్రయాణికుల లగేజీనీ అధికారులు తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఓ మహిళ వద్ద 583 గ్రాములు బంగారాన్ని అధికారులు గుర్తించారు. బంగారానికి సంబంధించిన ఎటువంటి రసీదులు లేకపోవడంతో మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రయాణికురాలి వివరాలు తెలియాల్సి ఉంది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement