నల్లగొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి 55 మేకలు చోరీకి గురయ్యాయి.
భువనగిరి : నల్లగొండ జిల్లా భువనగిరి మండలం చందుపట్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి 55 మేకలు చోరీకి గురయ్యాయి. మంగళవారం ఉదయం షెడ్డులో మేకలు లేకపోవడాన్ని గుర్తించిన మేకల యజమానులు శ్రీనివాస్, శంకరయ్య భువనగిరి రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎత్తుకెళ్లిన మేకల విలువ సుమారు రూ.3 లక్షలు ఉంటుందని తెలిపారు.